జీడిమెట్లలో అగ్ని ప్రమాదం : 8 మందికి గాయాలు

హైదరాబాద్ : జీడిమెట్ల  పారిశ్రామికవాడలోని జయరాజ్  ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. స్టీల్ ఫర్నెస్ బ్లాస్ట్ అయింది.  దీంతో 8 మంది కార్మికులకు గాయాలు కావడంతో  స్థానికులు దగ్గరలోని హాస్పిటల్ కు  తరలించారు. వీరిని యూపీ, బీహార్ కు చెందిన బిస్వేశ్వర్ దేవ్, ముఖేష్, పరివీర్ మహానాయక్, కమలేశ్ మిశ్రా,  మహావేంద్రమ్,  సురేష్ సింగ్ గా గుర్తించారు.

వీరిలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. భారీ శబ్ధం రావడంతో సమీపంలోని బస్తీ వాసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

See Also:ఎగ్జామ్స్ లో మాస్ కాపీయింగ్ : మైక్రోఫోన్లు, ఇయర్ పిన్స్

 

 

Latest Updates