నడుస్తున్న రైల్లో మంటలు

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం… మీర్జాపూర్ జిల్లా కైలాహత్ లో రైలు ప్రమాదం జరిగింది. కామాఖ్య ఎక్స్ ప్రెస్ రైలు నడుస్తుండగా… ఇంజిన్, జెనరేటర్ రూమ్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ వెంటనే అలర్టయ్యాడు. రైలు పార్సిల్ కోచ్ నుంచి.. జెనరేటర్ రూమ్, ఇంజిన్ లను వేరు చేశాడు. భారీ ప్రమాదాన్ని తప్పించాడు. ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు చెప్పారు.

ఈ సంఘటనతో ఢిల్లీ – హౌరా మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరింత సహాయం కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు రైల్వే అధికారులు.

Latest Updates