గడ్డివాము అంటుకుని 20 ఇండ్లు దగ్ధం

కృష్టా జిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు NTR కాలనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 20 ఇండ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొదటగా గడ్డివాముకు మంటలు అంటుకున్నాయి. ఆపై పక్కనే ఉన్న పూరిగురిసెకు మంటలు వ్యాపించాయి. ఆ మంటల ధాటికి గుడిసెలో ఉన్న గ్యాస్ సిలెండర్ పేలిపోయింది. ఒకదాని పక్కనే మరొక ఇండ్లు ఉండటంతో మంటలు తొందరగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని… ఆస్తినష్టం మాత్రం భారీగా జరిగిందని స్థానికులు తెలిపారు. ఊరికి దగ్గరలో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో మంటలు ఆర్పడానికి వీలు లేకుండా పోయిందని చెప్పారు. దాదాపు 30 కిలోమీటర్ల దూరం నుంచి ఫైర్ ఇంజన్ వచ్చే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని గ్రామస్తులు బాధపడ్డారు.

Latest Updates