SBI బ్యాంకులో అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్: అల్వాల్ లోని SBIబ్యాంకులో అగ్నిప్రమాదం జరిగింది. బ్యాంకు నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు భయానికి గురయ్యారు.  వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా… హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ టీం… మంటలను ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే బ్యాంకులో మంటలు అంటుకున్నట్లు చెప్పారు. అయితే లాకర్లు మాత్రం సేఫ్ గా ఉన్నట్లు బ్యాంకు మేనేజర్ తెలిపారని ఫైర్ ఆఫీసర్ దనుంజయ్ చెప్పారు. బయట ఉన్న కంప్యూటర్లు,  ఫైల్స్ కాలిపోయినట్లు ఆయన తెలిపారు.

Latest Updates