ఢిల్లీలో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి

ఢిల్లీలోని ఓ బిల్డింగ్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ, షాహిన్ బాగ్ ఏరియాలోని ఓ నాలుగు అంతస్థుల బిల్డింగ్ లోని రెండవ ఫ్లోర్ లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఎండాకాలం కావడంతో అగ్నికీలలు విపరీతంగా మంటలను వెదజల్లాయి. వీటిని కంట్రోల్ చేయడానికి అగ్నిమాపక సిబ్బంది  శ్రమిస్తున్నారు. అయితే.. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియలేదు.

Latest Updates