తిరుపతి లడ్డూ తయారీ కేంద్రంలో ఫైర్ యాక్సిడెంట్

తిరుమలలో అగ్ని ప్రమాదం జరిగింది. లడ్డూ తయారీకి ఏర్పాటు చేసిన అదనపు బూందీపోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని రెండు ఫైరింజన్లతో  ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేస్తున్నారు. బూందీ తయారీలో నెయ్యి ఉపయోగిస్తారని.. బ్లోయర్లకు, గోడలకు నెయ్యి జిడ్డు పేరుకు పోవడంతో.. ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందని పోటు కార్మికులు పేర్కొన్నారు. గతంలోనూ ఇదే తరహాలో బూందిపోటులో అగ్నిప్రమాదాలు జరిగాయని వారు అన్నారు.

Fire accident In Tirupati Temple's Laddu Making Unit

 

Latest Updates