వినాయక మండపంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: వినాయక మండపంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన హైదరాబాద్ మల్కాజ్ గిరి పోలీస్టేషన్ పరిదిలోని ఎస్పీ నగర్ ఈస్ట్లొ జరిగింది.వినాయక చవితి పండగ సంద్భంగా.. నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా… ప్రగతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓ షటర్ లో వినాయకున్ని పెట్టుకున్నారు. అయితే గురువారం సాయంత్రం మండపం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న స్థానికులు, యువత కలిసి మంటలను ఆర్పారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రణాపాయం సంభవించలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న మల్కాజ్ గిరి పోలీసులు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. 

Latest Updates