కంచెకు నిప్పు : తగలబడ్డ 200 ఎకరాలు

fire-accident-in-yadadri-district

యాదాద్రి భువనగిరి: కంచెకు ఆగంతకులు నిప్పు పెట్టిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. భువనగిరి మండలం, కూనూరు గ్రామ శివారు కంచెకు బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. దీంతో మంటలు చెలరేగడంతో దాదాపు 200 ఎకరాలకు నిప్పు అంటుకుంది. కంచెతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన తోటలకు కూడా నిప్పు వ్యాపించింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. అందుబాటులో ఫైర్ ఇంజన్ లేకపోవడంతో.. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వాటర్ తో మంటలను ఆర్పుతున్నారు. కూనూరు, కేసారం, చందుపట్ల గ్రామాల రైతులు నీళ్లు చల్లుతున్నప్పటికీ.. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో భయాందోళనకు గురవుతున్నారు. మండల కేంద్రంలో ఫైర్ ఇంజన్ లేకపోవడంతో సీరియస్ అవుతున్నారు ప్రజలు. అసలే ఎండాకాలం కావడంతో కంచెలో గడ్డి ఎడ్డి పోయింది. దీంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని తెలిపారు రైతులు. అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు ప్రాణ నష్టం జరగనప్పటికీ .. భారీగా ఆస్తి నష్టం జరిగిందని కన్నీరుమున్నీరవుతున్నారు అన్నదాతలు. పశువులు మేసే గడ్డి తగలబెట్టారని తిట్టిపోస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందని విచారణ జరుపుతున్నామని తెలిపారు పోలీసులు.

Latest Updates