క్రికెట‌ర్ శ్రీశాంత్ ఇంట్లో అగ్నిప్రమాదం

కేర‌ళ‌లోని కొచ్చిలో క్రికెట‌ర్ శ్రీశాంత్ ఇంట్లో ఇవాళ(శనివారం) ఉద‌యం అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. తెల్ల‌వారుజామున 2 గంట‌ల‌కు ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అగ్ని మంట‌ల్లో ఓ రూమ్ పూర్తిగా ద‌గ్ధ‌మైంది. అయితే ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణనష్టం జ‌ర‌గ‌లేదు. మంట‌లు వ్యాపించిన స‌మ‌యంలో ఇంట్లో క్రికెట‌ర్ భార్య‌, పిల్ల‌లు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం క్రికెట‌ర్ శ్రీశాంత్‌పై ఉన్న నిషేధ కాలాన్ని బీసీసీఐ త‌గ్గించింది. జీవిత‌కాల నిషేధం నుంచి కేవ‌లం ఏడేళ్ల నిషేధానికి ప‌రిమితం చేశారు. తాజాగా బీసీసీఐ అంబుడ్స్‌మెన్ ఇచ్చిన ఆదేశాల‌తో శ్రీశాంత్ మ‌ళ్లీ 2020లో క్రికెట్ ఆడే అవ‌కాశాలు ఉన్నాయి.

 

Latest Updates