క‌రోనా స్పెష‌ల్ ఆస్ప‌త్రిలో అగ్ని ప్ర‌మాదం.. 8 మంది పేషెంట్లు..

ఢిల్లీలోని ఓ క‌రోనా స్పెష‌ల్ ఆస్ప‌త్రిలో శ‌నివారం అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. హౌజ్ ఖాస్ ఏరియాలోని సైగ్న‌స్ ఆర్థోకేర్ ఆస్ప‌త్రిలో ఉన్న‌ట్లుండి మంట‌లు చెల‌రేగాయి. క‌రోనా పేషెంట్ల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఈ హాస్పిట‌ల్ లోని మూడో ఫ్లోర్ లో ఒక్క‌సారిగా మంట‌లు వ‌చ్చాయి. దీంతో ఎనిమిది మంది పేషెంట్లు అక్క‌డ చిక్కుకుపోయారు. ఆస్ప‌త్రి సిబ్బంది స‌మాచారంతో వెంట‌నే ఫైరింజ‌న్లు అక్క‌డికి చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంట‌లు ఆర్పి.. ఆ ఎనిమిది మందినీ ర‌క్షించార‌ని ఫైర్ స‌ర్వీస్ డిపార్ట్ మెంట్ డైరెక్ట‌ర్ అతుల్ గార్గ్ చెప్పారు. అయితే అగ్ని ప్రమాదానికి కార‌ణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు.. ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌న్న దానిపై ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌మాదంలో ఎవ‌రికీ ప్రాణ హాని జ‌ర‌గ‌లేద‌ని, కొంత మేర ఆస్తి న‌ష్టం జ‌రిగింద‌ని తెలిపారు.

Latest Updates