ముంబై MTNL బిల్డింగ్ లో భారీగా మంటలు

fire-broken-in-mumbai-mtnl-building

ముంబైలో మరో అగ్నిప్రమాదం స్థానికులను, అధికారులను టెన్షన్ పెడుతోంది. బాంద్రాలోని మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. భవనంలో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.

వెంటనే స్పందించిన ఫైర్ డిపార్టుమెంట్, పోలీస్ డిపార్టుమెంట్ రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. నాలుగో అంతస్తులో మంటలు చెలరేగినట్టు తెలిసింది. 14 ఫైరింజన్లు బిల్డింగ్ దగ్గరకు చేరుకున్నాయి. బిల్డింగ్ లోని వారందరినీ బయటకు పంపించే ప్రయత్నాల్లో చేస్తున్నారు అధికారులు.

Latest Updates