హోటల్ అర్పిత్‌ ప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీ కరోల్‌బాగ్‌లోని హోటల్ అర్పిత్‌ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది.ఇవాళ ఉదయం ఈ ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా..ఐదుగురికి గాయాలయ్యాయి. మరో ముగ్గురు గల్లంతైనట్లు సమాచారం.

విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని అర్పిత్‌ ప్యాలెస్‌లో చెలరేగుతున్న మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికులను అలర్ట్ చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందంటున్నారు.

Latest Updates