ఓలా క్యాబ్ లో మంటలు.. తప్పిన ముప్పు

సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో కారు ప్రమాదం జరిగింది. ఓలా క్యాబ్ కారులో మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్దం అయింది. బోయిన్ పల్లి నుండి సుచిత్రకు కస్టమర్ ను పికప్ చేసుకోవడానికి కార్ డ్రైవర్ ఫరూక్ అలీ ఈ ఉదయం వెళ్తున్న టైమ్ లో ఈ ప్రమాదం జరిగింది.

బోయిన్ పల్లి దగ్గరకు రాగానే కారు బాగా వేడెక్కింది. ట్రబుల్ ఇస్తుండటంతో… కారును ఆపి.. బ్యానెల్ ఓపెన్ చేశాడు డ్రైవర్. అదే సమంయలో.. ఒక్కసారిగా కారు ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. కానీ ఫలితం దక్కలేదు. క్షణాల్లో కారు మొత్తం మంటలు వ్యాపించాయి.

పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అర్పివేశారు. వోలో క్యాబ్ లో ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

Latest Updates