బరితెగించిన పాక్..కథువా జిల్లాలో కాల్పులు

కశ్మీర్ అంశంలో అంతర్జాతీయంగా ఎదురు దెబ్బలు తగులుతున్నా పాకిస్థాన్ తీరు మారడం లేదు. సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులు జరుపుతున్నారు పాక్ రేంజర్లు. కథువా జిల్లాలోని హీరా నగర్ సెక్టార్ లో భారీగా ఫైరింగ్ చేశారు. సమీప గ్రామాలపై మోర్టారు షెల్స్ ప్రయోగించారు. పాక్ రేంజర్ల కాల్పుల్లో కొన్ని ఆస్తులు తగలబడి పోయాయి.

ఇండ్లకు పెద్ద పెద్ద రంద్రాలు పడ్డాయి. కాల్పుల శబ్దంతో సరిహద్దు గ్రామస్తులు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇళ్ల నుంచి బయటికి రావడానికే జంకుతున్నారు.

Latest Updates