ఢిల్లీ ఎయిమ్స్ లో భారీ అగ్ని ప్రమాదం..

ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  ఎమర్జెన్సీ వార్డులో చెలరేగిన మంటలు మొదటి,రెండవ అంతస్థులోకి వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్ముకుపోవడంతో  ఒక్కసారిగా పేషెంట్లు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ పడుతూ పరుగులు తీశారు. కొందరు పేషంట్లను వేరే భవనంలోకి తరలించారు.  ఎయిమ్స్ అధికారులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా  34 ఫైరింజన్లతో  మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరో వైపు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఇదే ఆస్పత్రిలోని  వేరే భవనంలో గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం జైట్లీ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది.

Latest Updates