స్కూల్ బస్సు లో మంటలు విద్యార్థులు సురక్షితం

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. స్కూలు బస్సు దగ్ధమైన ఘటనలో ప్రమాదం తప్పింది. శుక్రవారం దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని నిర్మలగిరి పాఠశాలకు చెందిన బస్సు 25 మంది విద్యార్థులతో చాగల్లు బయలు దేరింది. మీనా నగరం సమీపంలో బస్సు ఇంజన్ నుంచి అకస్మాత్తుగా పొగలు, మంటలు వచ్చాయి. విషయం గమనించిన డ్రైవర్ వెంటనే అలర్టయ్యాడు. బస్సును రోడ్డు పక్కగా ఆపి విద్యార్థులను కిందికిదించాడు. ప్రమాదం నుంచి విద్యార్థులు సురక్షితంగా బయటపడగా..బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.  షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Latest Updates