ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 24 ఫైరింజన్లు

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాగ్ పడ్ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రెండు, మూడు అంతస్థుల వరకు  వ్యాపించాయి. ఘటన సమయంలో మాల్ లో 200 నుంచి 300 మంది ఉన్నారు. వారిని సురక్షితంగా కాపాడారు. స్థానికుల సమాచారంతో 24 ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి వచ్చి మంటలను ఆర్పుతున్నాయి. ఇవాళ ఉదయం వరకు కూడా ఇంకా మంటలు అదుపులోకి  రాలేదు.  చుట్టు పక్కల  బిల్డింగ్ లో ఉన్న దాదాపు 3500 మందిని అక్కడి నుంచి పక్కనున్న 55 అంతస్థుల బిల్డింగ్ లోకి తరలించారు. మంటలను అదుపులోకి తెచ్చే సమయంలో ఇద్దరు ఫైర్ సిబ్బందికి గాయాలయ్యాయి. వారిని స్థానిక జేజే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద తీవ్రతను బట్టి  లెవల్ 5 ఘటనగా ప్రకటించారు అధికారులు.

ఒక్కసారి చార్జ్ చేస్తే 210 కిలోమీటర్లు

ఇచ్చట పెండ్లి చూపులు.. ఓన్లీ రైతులకే!

ఇంటర్ లో టాపర్లు ఎంసెట్​లో క్వాలిఫై కాలే

Latest Updates