అమెరికాలో కాల్పులు: ఇద్దరు విద్యార్ధులు మృతి

అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. చార్లెట్ సిటీలోని నార్త్ కరోలినా యూనివర్శిటీలో మంగళవారం ఫైరింగ్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలియగానే పోలీసులు స్పాట్ కు చేరుకుని కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వర్శిటీ నుంచి విద్యార్థులందరినీ బయటకు తరలించారు. ఫైరింగ్ లో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు నార్త్ కరోలినా వర్శిటీ యాజమాన్యం, చార్లెట్ సిటీ మేయర్ సంతాపం తెలిపారు. ప్రస్తుతం యూనివర్శిటీని తాత్కాలికంగా మూసేశారు. గత నాలుగు రోజులుగా అమెరికాలో కాల్పుల మోతమోగుతూనే ఉంది. ఆదివారం నాడు వెస్ట్ బాల్టిమోర్ లో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, ఏడుగురికి గాయాలయ్యాయి. అటు సిన్సినాటిలో సిక్కు కుటుంబాన్ని కూడా కాల్చి చంపారు.

Latest Updates