అమెరికాలో కాల్పులు: ఆరుగురి మృతి

అమెరికా: న్యూజెర్సీలోని జెర్సీ టౌన్ లో ఫైరింగ్ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. వీరిలో ముగ్గురు పౌరులు, ఇద్ధరు నిందితులు, ఒక పోలీస్ ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ ఘటన ఈ రోజు పొద్దున జరిగింది. (అమెరికా టైమ్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం) ట్రక్కులో వచ్చిన దుండగులు కిరాణా షాప్ పై కాల్పులు జరిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగా… పోలీసులకు దుండగులకు మధ్య ఫైరింగ్ జరిగింది. ఈ కాల్పుల్లో ఒక పోలీస్ అధికారి చనిపోయారు. వీరు గతంలో గన్ కల్చర్ నిర్మూలనకు వ్యతికేకంగా పనిచేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అమెరికా ప్రెసిడింట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇది ఒక భయానక సంఘటన అని… మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నట్లు చెప్పారు పోలీసులు.