తొలి 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా..

5జీ ఫోన్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ ఫోన్లు ఎప్పుడెప్పుడు మన మార్కెట్‌లోకి వస్తాయా..? అని ఎదురుచూసిన వాళ్లు చాలా మందే ఉన్నారు. వీరి ఆసక్తి మేరకు రియల్‌ మి కంపెనీ తొలి 5జీ ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. రియల్‌ మి ఎక్స్50 ప్రొ 5జీ పేరుతో దీన్ని విడుదల చేసింది. ఈ ఫోన్ ధర వేరియంట్ బట్టి రూ.37,999గా, రూ.39,999గా, రూ.44,999గా ఉన్నాయి. ఈ ఫోన్‌ సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి ఫ్లిప్‌ కార్ట్‌‌, రియల్‌ మి.కామ్‌ల్లో సేల్‌కు వచ్చినట్టు రియల్‌ మి ఇండియా సీఈవో మాధవ్ సేథ్ తెలిపారు. మోస్ట్ పవర్‌ ఫుల్ 5జీ స్మార్ట్‌‌ఫోన్‌గా ఇది మార్కెట్‌లోకి వచ్చిందన్నారు. రియల్‌ మి నుంచి వచ్చిన అతి కాస్ట్‌‌లీ హ్యాండ్‌ సెట్స్ ఇవేనన్నారు. 65డబ్ల్యూ సూపర్‌ డార్ట్, వరల్డ్ ఫాస్టెస్ట్ ఛార్జింగ్, 4,200 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ కాంబినేషన్‌‌లో ఇది వచ్చింది.

Latest Updates