తొలి లవ్ జీహాద్ కేసు : మతం మార్చుకో లేదంటే..చంపేస్తా

ఉత్తర ప్రదేశ్ లో తొలి లవ్ జీహాద్ కేసు నమోదైంది. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం లవ్ జిహాద్ పేరుతో కొత్త చట్టాన్ని అమలు చేసింది. చట్టం ప్రకారం.. బలవంతపు మత మార్పిడికి పాల్పడితే 10 సంవత్సరాల జైలు శిక్షతోపాటు, రూ. 50 వేల జరిమానా విధిస్తారు. ఆ మహిళకు రూ. 5 లక్షల పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఈ నేపథ్యంలో యూపీ దావా డియోరానియాలో తనని బలవంతంగా మతం మార్చేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లాక్ డౌన్ లో తనకు పెళ్లైందని, కానీ నిందితుడు తనని మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై యూపీ బలవంతపు మార్పిడి వ్యతిరేక చట్టం సెక్షన్ 3/5, సెక్షన్ 504, ఇండియన్ పీనల్ కోడ్ 506 సెక్షన్ల కింద  కేసు నమోదు చేశారు. ఆ తర్వాత నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

Latest Updates