దుబాయ్‌‌‌‌‌‌‌‌లో ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఆర్టిఫిషియల్‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ వర్సిటీ

దుబాయ్‌‌‌‌‌‌‌‌ : ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీని దుబాయ్‌‌‌‌‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ అబుదాబీలో లాంచ్‌‌ చేసింది. మహమ్మద్‌‌‌‌‌‌‌‌ బిన్‌‌‌‌‌‌‌‌ జయద్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఆర్టిఫిషియల్‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ పేరుతో దీన్ని గురువారం ప్రారంభించారు. ముందుగా ఇందులో డిగ్రీ స్థాయిలో కోర్సులను అందజేస్తారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 20న క్లాసులు ప్రారంభించేందుకు అప్లికేషన్స్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్నారు. సీటు పొందిన స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌తోపాటు హెల్త్‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌, హాస్టల్‌‌‌‌‌‌‌‌ వసతి కల్పిస్తారు.

‘ఆర్టిఫిషియల్‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే ప్రపంచాన్ని మారుస్తోంది, మనిషి మైండ్‌‌‌‌‌‌‌‌లోని అపరిమితమైన ఊహాశక్తిని పూర్తిగా వెతకడం కోసం ఈ కోర్సులు సాయపడతాయి. ఇప్పుడున్న టెక్నాలజీని ఎన్నో రెట్లు పెంచుకునే వీలుంది.’ అని యూఏఈ మంత్రి సుల్తాన్ అహ్మద్ జాబెర్ అన్నారు.

Latest Updates