మార్కెట్లోకి వచ్చిన స్పుత్నిక్ వ్యాక్సిన్

కరోనావైరస్‌ నివారణకు రష్యా తయారుచేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మార్కెట్లోకి విడుదల చేయబడింది. రష్యాకు చెందిన గామాలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ మరియు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) సంయుక్తంగా తయారుచేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మొదటి బ్యాచ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చనట్లు రష్యన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

‘కరోనావైరస్ నివారణకు గామాలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన కొత్త ‘గామ్-కోవిడ్-వాక్’ (స్పుత్నిక్ వి) టీకా యొక్క మొదటి బ్యాచ్ ఉత్తీర్ణత సాధించింది. రోజ్‌డ్రావ్నాడ్జోర్ (మెడికల్ డివైస్ రెగ్యులేటర్) యొక్క ప్రయోగశాలలలో నాణ్యతా పరీక్షలు నెగ్గిన తర్వాత సివిల్ సర్క్యులేషన్‌లోకి విడుదల చేయబడింది’ రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ COVID-19కు వ్యతిరేకంగా ఆగస్టు 11న స్పుత్నిక్ వి టీకాను మొదటగా తయారుచేసింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో.. రాజధానిలోని కరోనా బాధితులకు వైరస్ టీకాలు వేస్తామని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. త్వరలోనే ఈ రష్యన్ వ్యాక్సిన్ యొక్క మొదటి బ్యాచ్ వివిధ దేశాలకు కూడా పంపిణీ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

For More News..

రాష్ట్రంలో మరో 2,932 కరోనా పాజిటివ్ కేసులు

ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతి

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజు కట్టినోళ్లంతా పాస్!

Latest Updates