అయోధ్య తీర్పుపై హైదరాబాద్‌లో మహిళపై కేసు నమోదు

వివాదంలో ఉన్న రామ జన్మభూమిని హిందువులకు కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ తీర్పుకు సంబంధించి ప్రజలు ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని ఆంక్షలు విధించింది. ఆ తీర్పు వ్యతిరేకిస్తూ ఓ మహిళ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

సైదాబాద్‌లోని జీవన్‌యార్జంగ్ కాలనీకి చెందిన ముస్లీం మహిళ జిల్లే హ్యుమా ఈ ఘటనకు పాల్పడింది. తమ సామాజిక వర్గానికి చెందిన వందమందికి పైగా మహిళలు, అమ్మాయిలతో కలిసి యుజలీషా ఈద్గా మైదానంలో సమావేశం ఏర్పాటు చేసింది. దాదాపు 20 నిమిషాలపాటు అందరితో కలిసి ప్రార్ధనలు నిర్వహించింది. ఆ తర్వాత హ్యుమా అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ స్లోగన్లు చేసింది. దాంతో ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తులు స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికెళ్లిన పోలీసులు హ్యుమాను అదుపులోకి తీసుకున్నారు. హ్యుమాపై 124ఎ, 153ఎ, 153బి, 505-1-బి, 505-1-సి, 505-2, 295ఎ, 34, మరియు 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Latest Updates