‘లవ్ జిహాద్’ చట్టం కింద యూపీలో ఫస్ట్ కేసు

లక్నో: లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ సర్కారు తీసుకొచ్చిన కొత్త చట్టం కింద ఫస్ట్ కేసు నమోదైంది. బరేలీ జిల్లాలో ఓ యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు బుక్ చేశారు. బరేలీ జిల్లాలోని దేవర్నియన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షరీఫ్ నగర్ గ్రామానికి చెందిన తికారాం.. అదే గ్రామానికి చెందిన ఉవైష్ అహ్మద్​పై  ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తన కూతుర్ని ప్రలోభపెట్టి మత మార్పిడికి ప్రయత్నిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తన కూతురు, అహ్మద్ కలిసి చదువుకున్నారని, పెండ్లి కోసం మతం మారాలని అహ్మద్ బలవంత పెడుతున్నాడని, అయితే తన కూతురు ఒప్పుకోలేదని, ఆమెను కిడ్నాప్ చేస్తానని బెదిరిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

Latest Updates