ఏపీలో తొలి కరోనా కేసు నమోదు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి పాకింది. ఏపీలోని నెల్లూరు జిల్లా యువకుడికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. ఈ మధ్యే ఇటలీ నుంచి వచ్చిన యువకుడికి కరోనా ఉన్నట్లు తేలింది. దాంతో ఆ యువకుడు నివసించే ప్రాంతమైన చిన్న బజార్‌లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఆ ఏరియాను శుభ్రం చేసేందేకు శానిటరీ డిపార్ట్‌మెంట్ సమాయత్తమవుతుంది. వెంటనే ఆ యువకుడిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకివ వ్యక్తి ఇటలీ నుంచి వచ్చిన తర్వాత కలిసిన వారందరి సమాచారం కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా.. అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దాంతో అతన్ని కూడా ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోపక్క కరోనా భయంతో రంగనాథస్వామి రథోత్సవాన్ని కూడా ఆపేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అయితే రథోత్సవం ఆపడం మంచిది కాదని.. కనీసం తూర్పుమాడ వీధులలోనైనా ఈ ఉత్సవాన్ని జరపాలని పండితులు నిర్ణయించారు.

For More News..

రైల్వే శాఖ కొత్త రూల్.. ప్రయాణికులపై భారం

సమ్మె చేస్తే జాబ్ నుంచి తీసేయండి

ఏపీ పంపిస్తామన్నా.. తెలంగాణ తీసుకెళ్లట్లేదు..

ఇయర్ ఫోన్స్ కొంటే.. కారు గెలిచారని ఫోన్

రేవంత్ పోరాటంతో కాంగ్రెస్‌కు సంబంధం లేదు

Latest Updates