ఏపీలో తొలి కరోనా పేషెంట్ డిశ్చార్జ్

ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా పేషెంట్ పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇటలీలో ఎంఎస్ చదువుతున్న నెల్లూరు యువకుడు ఈ నెల 6వ తేదీ విమానంలో చెన్నై వచ్చాడు. అక్కడి నుంచి కారులో నెల్లుూరు చేరుకున్నాడు. అయితే 9వ తేదీన అతడికి కరోనా లక్షణాలు కనిపించడంతో నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. అతడి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేయగా.. కరోనా ఉన్నట్లు తేలింది. 14 రోజుల పాటు చికిత్స అందించారు డాక్టర్లు.

ట్రీట్మెంట్ తర్వాత మూడు సార్లు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. దీంతో అతడిని డిశ్చార్జ్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ యువకుడ్ని మరో 14 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంచి.. డాక్టర్లు పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత కూడా మరోసారి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

Latest Updates