మేడిన్ ఇండియా తొలి ఫైటర్ జెట్

భారత వైమానిక దళ అమ్ములపొదిలోకి మరో ఫైటర్ జెట్ చేరింది. లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ .. వైమానిక దళంలోకి వచ్చేసింది. బెంగుళూరులో జరుగుతున్న ఎయిర్ షోలో తేజస్ ను ప్రదర్శించారు. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ .. యుద్ధ విమానం తేజస్ లో ప్రయాణించారు. కోపైలట్ గా ఆయన ఆ విమానంలో జర్నీ చేశారు.

LCA తేజస్ ఫైటర్ జెట్ … మొట్టమొదటి ‘మేడిన్ ఇండియా సింగిల్ ఇంజిన్ మల్టీ రోల్ లైటర్ ఫైటర్’.  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ , ఇండియన్ నేవీ కోసం….. ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ , హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్) సంయుక్తంగా దీనిని నిర్మించాయి. భారతీయ వైమానిక దళానికి ఈ విమానాన్ని… మిలటరీ ఏవియేషన్ రెగ్యులేటర్ అయిన సెమిలాక్ సంస్థ ఇటీవలే అప్పగించింది. పూర్తి స్థాయిలో ఆపరేషనల్ క్లియరెన్స్ వచ్చేసింది. ఆపరేషనల్ క్లియరెన్స్ దక్కడం ఓ మైలురాయి అని ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా తెలిపారు. ఇటీవల పోక్రాన్ లో జరిగిన వాయుశక్తి ప్రదర్శనలో తేజస్ ను ప్రదర్శించారు.

బెంగళూరులో ఎయిర్ షోలో తేజస్ విమానంలో ప్రయాణించిన బిపిన్ రావత్.. ఏవియోనిక్స్ , టార్గెటింగ్ బాగున్నాయని అన్నారు. ఇండియా వైమానిక శక్తి తేజస్ తో మరింత పెరగనుందని చెప్పారు రావత్.

Latest Updates