మాస్క్ లు తయారు చేసిన భారత ప్రథమ మహిళ సవితా కోవింద్

కరోనా వైరస్ నివారణకు ప్రతీ ఒక్కరూ ఏదో ఒక విధంగా తమ వంతు కృషి చేస్తున్నారు. కరోనాతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు కొందరు విరాళాలు ప్రకటించి…కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందించారు. మరికొందరు నిత్యవరస వస్తువులను అందజేస్తున్నారు. ఇందులో భాగంగా భారత ప్రథమ మహిళ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ భార్య సవితా కోవింద్… కరోనా నివారణకు తనవంతుగా మాస్కులను అందజేశారు. న్యూఢిల్లీలోని షెల్టర్ హోమ్స్ లో ఉన్న నిరాశ్రయులకు మాస్క్ లను తయారు చేసి అందించారు. రాష్ట్రపతి భవన్ లోని శక్తి హాత్ లో ఆమె స్వయంగా కుట్టుమిషన్ పై మాస్క్ లను రూపొందించారు.మాస్కులను ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్ మెంట్ బోర్డుకు పంపించారు సవితా కోవింద్.

Latest Updates