ఈ సినిమా చూడాలంటే 37రోజులు థియోటర్లోనే కూర్చోవాలి

థియోటర్లో కూర్చొని  సినిమా చూడాలంటే సాధారణంగా ఎంతటైం పడుతుంది. పెద్ద సినిమా అయితే మూడు గంటలు, చిన్న సినిమా అయితే రెండున్నర గంటల సమయం పడుతుంది. కానీ ఈ సినిమా చూడాలంటే  37 రోజులు పడుతుంది. లాజిస్టిక్ అనే పేరుతో తెరకెక్కిన ఈ ఎక్స్ పెరిమెంటల్  సినిమా ను స్వీడన్ కు చెందిన ఎరికా మంగూన్ సన్, డేనియల్ ఆండర్సన్ లు డైరక్ట్ చేశారు. ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో స్టోరీ, స్క్రీన్ ప్లే, నేరేషన్, ఎడిటింగ్, సాంగ్స్, ఫైట్స్ అన్నీ గజిబిజి గందరగోళంగా ఉండేలా చిత్రీకరించారు. కాబట్టే ఈ సినిమా డ్యూరేషన్  51,420 నిమిషాలు (857 గంటలు లేదా 35రోజులా 17 గంటలు ) అందుకే ఈ సినిమా ప్రపంచంలోనే మొట్టమొదటి పెద్ద సినిమాగా పేరు పొందింది.  దేశంలో అతిపెద్ద రెండో సినిమాను డెన్మార్క్ దేశానికి చెందిన బజోమెస్టమీ,రాయిటర్ క్రిస్టియాన్సెన్, జాకబ్ ఫెంగీర్ , రాస్ముస్ నీల్సన్,సూపర్ ఫ్లెక్స్ అనే  దర్శకులు మోడ్రన్ టైమ్స్ ఫర్ ఎవర్ అనే సినిమాను తెరక్కెక్కించారు. ఈ సినిమా మొత్తం నిడివి 14,400 నిమిషాలు. అంటే దాదాపు పదిరోజుల సమయం. ఈ సినిమా ప్రపంచంలో అతి ఎక్కువ సమయం ఉన్న రెండో సినిమాగా పేరు పొందింది.

Latest Updates