సూపర్ ఐడియా : వినాయకుడి ఫస్ట్ లుక్ అదుర్స్

మహారాష్ట్ర : వినాయక చవితికి దేశం రెడీ అవుతుంది. మండపాలు, డెకరేషన్లు, లైటింగ్స్, డీజే సౌండ్స్ ఏర్పాట్లలో యూత్ బిజీగా ఉన్నారు. వినాయక విగ్రహాలను ఇప్పట్నుంచే తరలిస్తున్నారు. అయితే..తమ వినాయకుడు వెరైటీగా ఉండాలనే ఆసక్తితో రకరకాల విగ్రహాలు పెట్టడం, డెకరేషన్లు చేయడం కామన్. కానీ.. వినాయక చవితిని ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ..ముంబైలోని లాల్ బగుచా రాజా సన్నిధిలో ఈ సారి చేసిన ఓ కొత్త టెక్నాలజీ అందరినీ విఫరీతంగా ఆకట్టుకుంటోంది. సినిమా స్టైల్లో గణేషుడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అచ్చం సినిమా థియోటర్ లాగే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. వెంటనే వినాయకుడు ఎంట్రీ అవుతాడు.

చుట్టు చుక్కలు, నవగ్రహాలు, ఆకాశంలో తేలియాడుతూ వినాయకుడు దర్శణమివ్వడం సూపర్బ్ అనిపిస్తింది. బ్యాంక్ గ్రౌండ్ నుంచి ఇస్రో ప్రయోగం..రాకెట్ దూసుకెళ్లడం. చంద్రాయాన్-2 లాంటి ప్రయోగాలు అన్నింటినీ కలిపి అద్భుతమైన వీడియోను రూపొందించారు. ఇది ఫస్ట్ లుక్ మాత్రమోనని తమ మండపానికి వచ్చే భక్తుల కోసం అసలు వినాయకుడి సినిమా సెప్టెంబర్-2 నుంచి చూపిస్తామంటున్నారు నిర్వాహకులు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అయ్యింది.

Latest Updates