లాసెట్ సీట్ల కేటాయింపు.. ఫస్ట్ ఫేజ్లో 5,912 మందికి సీట్లు

 లాసెట్ సీట్ల కేటాయింపు.. ఫస్ట్ ఫేజ్లో 5,912 మందికి సీట్లు

హైదరాబాద్: లా కోర్సుల్లో  ఎంట్రెన్స్  కోసం ఫస్ట్ ఫేజ్ లో  వెబ్ ఆప్షన్లు  పెట్టుకున్న విద్యార్థులకునవంబర్ 30న   సీట్లు కేటాయించారు. తెలంగాణ స్టేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS LAWCET), తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (PGLCET 2023) వెబ్ కౌన్సిలింగ్ జరిగింది. మొత్తం 5912 మంది అభ్యర్థులు సీటు దక్కించుకున్నారు.

లాట్‌లో కన్వీనర్ కోటా కింద 6894 సీట్లు అందుబాటులో ఉండగా, 12,835 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను వినియోగించుకున్నారు. అయితే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో 5,912 మందికి  సీట్లు కేటాయించారు. ఎంపికైన వారు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ లేదా NEFT ద్వారా ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించాలి. 

డిసెంబర్ 1, 6 మధ్య ఫిజికల్ వెరిఫికేషన్ కోసం ట్యూషన్ ఫీజు రసీదు, జాయినింగ్ లెటర్, ఒరిజినల్ సర్టిఫికేట్‌లతో పాటు కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాలి. ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత తుది కేటాయింపు ఆర్డర్ ఉంటుంది. డిసెంబర్ 4 నుంచి క్లాసులు జరగనున్నాయి.