విండీస్‌ తో ఫస్ట్‌ టెస్ట్‌ .. స్టోక్ స్‌ కు కెప్టెన్సీ

లండన్‌ : ఇంగ్లండ్‌ స్టార్ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్ తొలిసారి టెస్ట్‌‌ జట్టు పగ్గాలు అందుకున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌‌లో భాగంగా వెస్టిండీస్‌‌తో ఈ నెల 8న మొదలయ్యే ఫస్ట్​ టెస్ట్‌‌కు రెగుల్యర్‌ కెప్టెన్‌ జో రూట్‌ అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఇంగ్లండ్‌ బోర్డు స్టోక్ స్‌కు కెప్టెన్సీని అప్పగించింది. బట్లర్‌ ను వైస్‌‌ కెప్టెన్‌ గా నియమించింది. రూట్‌ భార్య వచ్చే వారం తమ రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం జట్టుతో కలిసున్న రూట్‌ నేడు ట్రెయినింగ్‌ క్యాంప్‌ వదిలి వెళ్లనున్నాడు. దీంతో ఇంగ్లండ్‌ టీమ్‌ తమలో తాము ఆడే వామప్‌ తో పాటు ఫస్ట్‌‌ టెస్ట్‌‌కు దూరం కానున్నాడు. సెకండ్‌ టెస్ట్‌‌కి తిరిగి జట్టుతో కలుస్తాడు.