ఫస్ట్ టైం: అమెరికాలో మంచి కోసం ఎమర్జెన్సీ

ఎమర్జెన్సీ పేరు చెబితే ఇండియా ఉలిక్కిపడుతుంది. అమెరికా అలా కాదు. అక్కడి స్పెషల్​ యాక్ట్​ ప్రకారం… లైఫ్​ థ్రెట్​ ఏర్పడితే చాలు, యమర్జెంట్​గా దానిని సాల్వ్​ చేయాలనుకుంటారు. వెంటనే ఎమర్జెన్సీ ప్రకటిస్తారు. ఇప్పుడు కరోనా వైరస్​ని ఢీకొట్టడానికీ అదే వెపన్​ని ప్రయోగించింది.  గతంలోనూ ఇంత కేర్​ఫుల్​గా ఉండబట్టే అమెరికా ఇలాంటి ప్రమాదాలను ఎన్నింటినో సక్సెస్​ఫుల్​గా దాటి ముందుకెళుతోంది. తన కెపాసిటీకి పరీక్ష ఎదురైనప్పుడు కుంగిపోకుండా నేలకు కొట్టిన బంతిలా, పాల పొంగులా పైకి లేస్తానంటోంది.

కరోనా వైరస్​ని మన దేశం నేషనల్​ డిజాస్టర్​గా ప్రకటించింది. ఆ వైరస్​ని​ కంట్రోల్​ చేయడానికి స్టేట్​ డిజాస్టర్​ రెస్పాన్స్​ ఫండ్స్​ వాడుకోవాలని సూచించింది. కానీ.. అమెరికాలో అలా కాదు. అక్కడ స్పెషల్​ యాక్ట్​ ఉంది. ఆ చట్టాన్ని ఇలాంటి కొన్ని సందర్భాల్లో దేశాధ్యక్షుడు బయటకు తీస్తారు. అదే.. ‘రాబర్ట్​ టి.స్టఫోర్డ్ డిజాస్టర్​ రిలీఫ్​ అండ్​ ఎమర్జెన్సీ అసిస్టెన్స్​ యాక్ట్​’.  స్టఫోర్డ్​ చట్టం అమెరికా ప్రెసిడెంట్​కి ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. ఈ చట్టం కోసం తెచ్చిన బిల్లు​ పాసవటంలో సెనేట్​ సభ్యుడు రాబర్ట్​ థియోడర్​ స్టఫోర్ట్​ ఎంతగానో కృషి చేయటం వల్ల దానికి ఆయన పేరు పెట్టారు. ఈ యాక్ట్​ ప్రకారం.. దేశంలో తలెత్తే విపత్తుల్ని ఎదుర్కోవటానికి చేపట్టాల్సిన చర్యల్ని ప్రెసిడెంట్​ ప్రకటిస్తారు. ఈ ప్రాసెస్​నే డిక్లరేషన్లు జారీ చేయటం అంటారు. ఇందులో భాగంగానే ఇప్పుడున్న అధ్యక్షుడు​ డొనాల్డ్​ ట్రంప్​ 50 బిలియన్​ డాలర్లకు పైగా (దాదాపు రూ.3.6 లక్షల కోట్ల) కేంద్ర ప్రభుత్వ నిధులు (ఫెడరల్​ ఎయిడ్​) విడుదల చేశారు.

ఈ ఫండ్స్​ను రాష్ట్రాలకు, లోకల్​ బాడీలకు (కౌంటీలకు) ఇస్తారు. డిజాస్టర్లు, ఎమర్జెన్సీలు చోటుచేసుకున్నప్పుడు ఆర్థిక సాయం అందించే వీలును ప్రెసిడెంట్​కి కల్పించటం కోసమే ఈ చట్టాన్ని రూపొందించారు. ఏదైనా ఒక ఇన్సిడెంట్​ జరిగితే బాధితులను సెంట్రల్​ ఫండ్స్​తో ఆదుకోవాలని అధ్యక్షుడు నిర్ణయించటాన్ని డిక్లరేషన్​గా చెబుతారు. స్టఫోర్డ్​ చట్టం కింద ముఖ్యంగా మూడు రకాల డిక్లరేషన్లు జారీ చేస్తారు. అవి.. 1. ఫైర్​ మేనేజ్​మెంట్​ అసిస్టెన్స్​ గ్రాంట్స్.​ 2. ఎమర్జెన్సీలు. 3. మేజర్​ డిజాస్టర్లు.

‘ఫెమా’దే బాధ్యత

దేశాన్ని కుదిపేసే తుఫాన్లు, టోర్నడోలు, అంటువ్యాధులు వంటి వాటిని అదుపు చేసే విషయంలో రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య కోఆర్డినేషన్​ కుదుర్చే బాధ్యతను ఒక ప్రైమరీ ఫెడరల్​ ఏజెన్సీకి అప్పగించారు. ఆ సంస్థ పేరు ఫెడరల్​ ఎమర్జెన్సీ మేనేజ్​మెంట్​ ఏజెన్సీ(ఎఫ్​ఈఎంఏ–ఫెమా). ఇది డిపార్ట్​మెంట్​ ఆఫ్​ హోమ్​ల్యాండ్​ సెక్యూరిటీ కింద పనిచేస్తుంది. ప్రెసిడెంట్​ ఎమర్జెన్సీ ప్రకటించగానే రంగంలోకి దిగి రాష్ట్రాలకు, కమ్యూనిటీలకు అవసరమైన సేవలను, కార్యక్రమాలను చేపడుతుంది.

విపత్తు వల్ల భవిష్యత్​లో భారీ నష్టం జరగకుండా నివారించటానికి ఫెమా ప్రయత్నం చేస్తుంది. దీనికయ్యే ఖర్చులో 75 శాతానికి పైగా నిధులను కేంద్రమే భరిస్తుంది. ఎమర్జెన్సీ విధించటం వల్ల రాష్ట్రాలకు ఆర్థికంగా చాలా వెసులుబాటు కలుగుతుంది. ఈ ఫండ్స్​కు తోడు రాష్ట్రాలూ సొంత ఎయిడ్​​ని రిలీజ్​ చేస్తాయి కాబట్టి బాధితులు మరింత ఎక్కువ ‘రిలీఫ్’ పొందుతారు. ఒక్కోసారి విపత్తు జరక్కముందు కూడా డిక్లరేషన్లను​ అడ్వాన్స్​గా ఇష్యూ చేస్తారు. ఆస్తి, ప్రాణ నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించటం, సేఫ్టీ కోసం ఇలా వ్యవహరిస్తారు.

గతంలో బోలెడు సార్లు

అమెరికాలో డిక్లరేషన్లు ఇవ్వటం ఇదే తొలిసారి కాదు. గతంలో ఎన్నోసార్లు ఈ చర్యలు చేపట్టారు. 1953 నుంచి ఇవి ఏటా పెరుగుతున్నాయి. 1974–2014 మధ్య ప్రతి సంవత్సరం 9 చొప్పున ఎమర్జెన్సీలు ప్రకటించారు. ఎక్కువగా ఇసుక తుఫాన్లు, వరదలు, కరువు–కాటకాలు, మంచు కప్పివేయటం వంటివి జరిగినప్పుడు అత్యవసర పరిస్థితులను పెట్టారు. వీటిలో హెల్త్​ ఎమర్జెన్సీల సంఖ్య తక్కువే. 2000 సంవత్సరంలో బిల్​ క్లింటన్​.. వెస్ట్​ నైల్​ వైరస్​ విజృంభించినప్పుడు, 2009లో బరాక్​ ఒబామా.. స్వైన్​ఫ్లూ స్వైరవిహారం చేసినప్పుడు ఎమర్జెన్సీ విధించారు.

Latest Updates