పోలండ్​ రచయిత్రికి తొలిసారి సాహితీ నోబెల్​

స్వీడిష్ అకాడమీ 2018, 2019 సంవత్సరాలకు సాహిత్యంలో నోబెల్ ప్రైజ్​లు గురువారం ప్రకటించింది. 2019 ఏడాదికి ఆస్ట్రియా రచయిత పీటర్ హండ్కేను, 2018కిగాను పోలండ్​ రచయిత్రి ఓల్గా తొకర్‌‌జుక్​ను ఎంపిక చేసినట్లు అకాడమీ వెల్లడించింది. ప్రైజ్​ కింద ఈ ఇద్దరు రైటర్లకు చెరో 6.5కోట్ల రూపాయలు, మెడల్ అందజేస్తారు. డిసెంబరు 10న స్వీడన్‌‌లో అవార్డుల ప్రదానం జరుగుతుంది. మీటూ ఉద్యమ నేపథ్యంలో కిందటేడాది పురస్కారాల ప్రకటన వాయిదాపడ్డ సంగతి తెలిసిందే.

పోలండ్​ రైటర్​కు ఫస్ట్​ టైమ్​

57ఏండ్ల ఓల్గా తొకర్‌‌జుక్ సాహిత్యంలో నోబెల్​ గెల్చుకున్న మొట్టమొదటి పోలండ్​రైటర్​గా నిలిచారు. నావలిస్ట్​​, యాక్టివిస్ట్​, మేధావిగా గొప్ప పేరుతెచ్చుకున్న ఆమె, 2007లో పోలిష్​ భాషలో ‘బెగూనీ’ పేరుతో రాసిన నవల.. 2017లో ‘ఫ్లైట్స్​’ పేరుతో ఇంగ్లీష్​లోకి అనువాదమైంది. లైఫ్​ జర్నీలో చెడును నివారించాలనే ఫిలాసఫీతో సాగే ఈ నవల(ఫ్లైట్స్​)కే ఇప్పుడు నోబెల్​ దక్కింది. ఓల్గా తన నవలల్లో ఒక అద్భుతమైన ఊహా ప్రపంచాన్ని, దేశాల మధ్య బోర్డర్లకు అతీతంగా సాగే మనుషుల జీవనసరళిని చూపిస్తారని, సబ్జెక్ట్​ నాలెలెడ్జ్​​ని పాఠకుడితో పంచుకోవాలనే తపన కనిపిస్తుందని స్వీడిష్​ అకాడమీ మెచ్చుకుంది. ఇదే ‘ఫ్లైట్స్’​ నవలకు కిందటేడాది ‘మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్‌‌’ కూడా లభించింది.

నోబెల్​ను తిట్టిన రెబల్​కే పట్టం

ఆలోచనలు రేకెత్తించే నవలలు, నాటకాలు రాయడంలో ఆస్ట్రియా రచయిత పీటర్​ హండ్కే(76) దిట్ట. అందుకే 2019 నోబెల్​ ప్రైజ్​ ఆయనను వరించింది. వివాదాస్పద రైటర్​గానూ పేరుపొందిన పీటర్​ ఐదేండ్ల కిందట ఓ సందర్భంలో.. సాహిత్యంలో ఇస్తున్న నోబెల్ ప్రైజ్​ను రద్దు చేయాలని, దానివల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదని తిట్టిపోశారు. అయితే లిటరేచర్​లో విశేష కృషికిగానూ ఆయనకే నోబెల్​ ఇస్తున్నట్లు స్వీడిష్​ అకాడమీ ఇవాళ ప్రకటించింది. హ్యూమన్​ ఎమోషన్స్​ను పీటర్ తనదైన శైలిలో ఎఫెక్టివ్​గా రాశారని అకాడమీ కొనియాడింది. తన తల్లి ఆత్మహత్యపై పీటర్ 1975లో రాసిన ‘ఎ సారో బియాండ్ డ్రీమ్స్’ అనే రచన ప్రపంచ వ్యాప్తంగా పాపులరైంది.

Latest Updates