చేప నుంచి 800 వోల్టుల కరెంట్.. వీడియో వైరల్…

కరెంట్ చేప.. క్రిస్మస్ లైట్లను వెలిగిస్తది!

అమెరికాలోని టెన్నిసీ అక్వేరియం ఇది. ఫొటోలో చిన్న చిన్న బల్బులు అమర్చిన ఓ క్రిస్మస్ చెట్టు ఉంది కదా. అక్వేరియంలో చేప కదిలినప్పుడల్లా క్రిస్మస్ చెట్టు పై లైట్లు చక్కుమని వెలుగుతున్నాయట. దీనిని చూసేందుకు జనం విపరీతంగా వస్తుండటంతో వైరల్ అయిపోయింది. క్రిస్మస్ లైట్లను వెలిగించే ఈ ఎలక్ట్రికల్ ఈల్ మిగెల్ వాట్సన్. ఇది మామూలుగా 10 వోల్టుల కరెంట్ రిలీజ్ చేస్తుందట. కానీ కోపమొచ్చినా, ఫుడ్ దొరికి ఎక్సైట్ అయినా ఇది ఏకంగా 800 వోల్టుల వరకూ కరెంట్ రిలీజ్ చేస్తుందట. ఆ కరెంట్‌నే సెన్సర్ల ద్వారా క్రిస్మస్ లైట్లకు లింక్ చేసి, వాటిని వెలిగిస్తున్నారట. అంతేకాదు.. ఇది కరెంట్ రిలీజ్ చేసినప్పుడల్లా సౌండ్ ఎఫెక్ట్ వచ్చేలా ఏర్పాట్లు కూడా చేశారట.