కారు డ్రైవర్‌కు ఫిట్స్.. డాక్టర్‌కు గాయాలు

fits-to-car-driver-while-driving-at-niloufer-hospital

హైదరాబాద్:  నాంపల్లి నిలోఫర్ హాస్పిటల్ లో కారు బీభత్సం సృష్టించింది. హాస్పిటల్ లో పార్క్ చేసిన కారును తీస్తుండగా , డ్రైవర్ లియాకత్ అలీ కు ఫీట్స్ వచ్చాయి. దీంతో  కారు  ఒక్కసారిగా అదుపు తప్పి అక్కడ పార్క్ చేసి ఉన్న బైకులపై దూసుకెళ్లింది.  అదే సమయంలో అటుగా వెళ్తున్న హౌస్ సర్జర్ డా.ప్రశాంత్ ను కూడా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతనికి ఎడమ చేయి ఫ్రాక్చర్ అవ్వగా , కుడి కాలికి గాయాలయ్యాయి. వెంటనే అతన్ని జూనియర్ డాక్టర్స్ చికిత్స నిమిత్తం నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని , ప్రభుత్వ ఆసుపత్రులలో పార్కింగ్ వ్యవస్థ లేనందువల్లనే ఈ ఘటన జరిగిందని జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. తక్కువ ఛార్జీలతో పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అయితే నిత్యం రద్దీగా ఉండే నిలోఫర్ హాస్పిటల్ ప్రాంగణంలో బుధవారం మధ్యాహ్నం అంతగా జన సంచారం లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు.

Latest Updates