టాటాఏస్ వాహనాన్ని ఢీకొట్టిన గ్రానైట్ లారీ..ఐదుగురు మృతి

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగాధర మండలం కురిక్యాల వద్ద శనివారం(నిన్న) రాత్రి టాటాఏస్ వాహనాన్ని గ్రానైట్ లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు . మృతులు  కొడిమ్యాల మండలం పూడూరు వాసులుగా గుర్తించారు పోలీసులు. టాటాఎస్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్నిఅరగంట పాటు శ్రమించి బయటకు తీశారు పోలీసులు.టాటాఎస్ వాహనం కరీంనగర్ నుంచి పూడురు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Latest Updates