అవయవ దానంతో ఐదుగురికి ప్రాణదానం

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయదానాలతో ఐదుగురి ప్రాణాలు దక్కాయి. నల్గొండ జిల్లా, గుర్రంపోడు మండలానికి మాధవరం కమలాకర్ రావు(40).. డిసెంబర్ ఒకటిన మైలర్దేవపల్లి నుండి శంషాబాద్ బయలుదేరాడు. అక్కడి నుండి తిరుగు ప్రయాణంలో మైలార్ దేవ్ పల్లి వెళ్ళడానికి టిఎస్ 06 యుసి 8906  ఆటో ఎక్కాడు. అయితే ప్రమాదవశాత్తు ఆటో బోల్తాపడటంతో కమలాకర్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని .. గాయపడ్డ కమలాకర్ రావును బంజారాహిల్స్ లోని విరించి హాస్పిటల్ కి  తరలించారు.  మాధవరం కమలాకర్ రావు బ్రెయిన్ డెడ్ అయినట్లుగా డాక్టర్లు పోలీసులకు తెలిపారు.

ఈ విషయాన్ని గమనించిన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు జీవన్ దాస్ సంస్థవారి సహకారంతో మాధవరం కమలాకర్ రావు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి, ఒప్పించి అతని అవయవాలను దానం చేయడానికి ఒప్పించారు. మాధవరం కమలాకర్ రావు అవయవాలు దానం చేయించి, ఆపదలో ఉన్న ఐదుగురు ప్రాణాలు కాపాడారు. తాను చనిపోయి మరో ఐదుగురికి ప్రాణదానం చేసిన మాధవరం కమలాకార్ రావును ప్రజలు, పోలీసులు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.  ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

Latest Updates