పాపం.. వారంలో ఐదు ఏనుగులు మృతి

చత్తీస్‌‌గఢ్‌లో ఏనుగుల మరణాలు కొనసాగుతున్నాయి. రాయ్‌గఢ్‌, ధంతరి జిల్లాల్లో మంగళవారం రెండు ఏనుగులు చనిపోయా యి. . దీంతో ఈ వారంలో మరణించిన ఏనుగుల సంఖ్య ఐదుకు చేరింది. రాయ్‌గఢ్జిల్లాలో కరెంట్‌‌ షాక్‌‌తో గజరాజు మృతిచెందగా, ధంతరి జిల్లాలో బురదలో కూరుకుని ఏనుగు పిల్ల చనిపోయింది. పొలంలో బోరు కోసం అక్రమంగా వేసిన కరెంటు వైరు తగలడం వల్ల ఏనుగు మరణించినట్టు రాయ్‌గఢ్ ఎస్పీ సంతోశ్సింగ్ చెప్పారు. ఈ ఘటనపై పొలం యజమానితోపాటు మరొకరిని విచారించామన్నారు. గాంగ్రెల్ రిజర్వాయర్ ఏరియాలోని ఉర్పుతిలో ఏనుగు పిల్లమృతదేహం దొరికింది. నీటి కోసం వచ్చి బురదలో చిక్కుకుని మరణించి ఉంటుందని ఫారెస్ట్ అధికారి చెప్పారు.

Latest Updates