మహారాష్ట్రలో చెరువులో మునిగి ఐదుగురు బాలికల మృతి

మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో విషాదం నెలకొంది. భోకార్డన్ సమీపంలోని తలేగావ్‌వాడీకి చెందిన ఐదుగురు బాలికలు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందారు. గ్రామానికి చెందిన ఆరుగురు బాలికలు బట్టలు ఉతికేందుకు చెరువు దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలో చెరువులోకి దిగిన ఐదుగురు చిన్నారులు చెరువు పూడికలో చిక్కుకుపోయారు. అటువైపుగా వెళ్తున్న కొందరు గమనించి బాలికలను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే…. అప్పటికే బాలికలు ఐదుగురూ మరణించినట్టు ఫూలంబ్రీ పీహెచ్‌సీ అధికారులు తెలిపారు. మృతులందరూ 5నుంచి ఏడేళ్లలోపు వారేనని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

 

Latest Updates