తమిళనాడులో ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో పేలుడు .. ఐదుగురు మృతి

తమిళనాడులో ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మంటల ధాటికి కూలీలు కాలిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికంగా ఉన్న హాస్పిటల్ కు తరలించారు. తమిళనాడులోని విరుదునగర్ జిల్లా మురుగనెరి ఏరియాలో  ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఫ్యాక్టరీ ఓనర్ శణ్ముగనాథన్ పై కేసు ఫైల్ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Latest Updates