చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

five-killed-in-road-accident-in-chittoor-district

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అయిదుగురు చనిపోగా.. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఇవాల(శుక్రవారం) ఉదయం జరిగింది. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరం వాసులు తిరుమల స్వామివారి దర్శనానికి జైలో వాహనంలో బయల్దేరారు.  రేణిగుంట మండలం గురవరాజుపల్లి  దగ్గరకు రాగానే ఆగి ఉన్న లారీని కారు  ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న రేణిగుంట అర్భన్‌ పోలీసులు గాయపడిన ఐదుగురిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

Latest Updates