ధారావిలో మరో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదు

ముంబైలోని మురికి వాడ ధారావిలో కొత్తగా మరో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇప్పటి వరకు ధారావిలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 22కు చేరింది.

ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికి వాడైన ధారావిలో…ఎక్కువ సంఖ్యలో జనాభా ఉండటంతో పాటు ఇరుకైన ప్రాంతం కూడా. దీంతో ఇక్కడ కరోనా ఈజీగా వ్యాపించి భారీగా నష్టం జరిగే అవకాశముందంటున్నారు అధికారులు. దీంతో ఇక్కడ నివసిస్తున్న వారికి కరోనా పరీక్షలను నిర్వహించాలని ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధికారులు నిర్ణయించారు. దీంతో కరోనా వేగంగా వ్యాపించే అవకాశం ఉండడంతో దాదాపు ఏడు లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ముంబై అగ్నిమాపక సిబ్బంది సహాయంతో ధారవి ప్రాంతాన్ని శానిటైజ్‌ చేస్తున్నారు.

Latest Updates