న‌న్నే ప్ర‌శ్నిస్తారా..? ఆర్ధిక శాఖ ఉన్న‌తాధికారుల్ని ఉరితీయించిన కిమ్

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ అరాచ‌కాలు మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చాయి. డైలీ ఎన్కే క‌థ‌నం ప్ర‌కారం జులై 30న డిన్న‌పార్టీ జ‌రిగింది. పార్టీలో కిమ్ జోంగ్ దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌‌పై త‌న ఆర్థిక వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులతో చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ఆర్ధిక వ్య‌వ‌హారాల శాఖ ఉన్న‌తాధికారులు దేశ ఆర్ధిక స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించేలా కొన్ని స‌ల‌హాలిచ్చారు. ప‌నిలో ప‌నిగా కిమ్ ప‌రిపాల‌న‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. దీంతో ఐదుగురు అధికారులపై కిమ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న ప‌రిపాల‌న‌పై విమ‌ర్శ‌లు చేసిన వారిని ఉరితీయాల‌ని సైన్యానికి ఆదేశించారు. కిమ్ ఆదేశాల ప్ర‌కారం సైనికులు ఐదుగురు అధికారుల్ని ఉరితీసిన‌ట్లు..సైనికులు చ‌ర్చించుకున్నార‌ని డైలీ ఎన్కే త‌న క‌థ‌నంలో ప్ర‌స్తావించింది.

Latest Updates