పాతబస్తీలో దారుణం… అక్కాచెల్లెళ్లపై అఘాయిత్యం

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి 9 వ తరగతి చదువుతున్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. ఆ తర్వాత స్కూల్లో, బాలిక నివసిస్తున్న బస్తీలో చెబుతానంటూ,  బ్లాక్ మెయిల్ చేస్తూ మరో నలుగురితో కలిసి ఆమెపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ బాలిక ఇంట్లో చెప్పుకోలేదన్న ధైర్యంతో ఆ ఐదుగురిలోని ఒక మైనర్ బాలుడు 7వ తరగతి చదువుతున్న బాలిక చెల్లెలితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ చెల్లెలు జరిగిన విషయాన్ని ఇంట్లో తెలిపింది. వారి తల్లిదండ్రులు ఇద్దరు కూతుళ్లనీ అడగడంతో అసలు విషయం బయటపడింది.  అత్యాచారం గురించి తెలుసుకున్న వారు ఐదుగురిపై కమాటిపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. వీరిలో ముగ్గురు మైనర్లు, ఇద్దరు మేజర్లని తెలిసింది. వారిపై అత్యాచారం, పొస్కో యాక్ట్ క్రింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Five people are charged with aggravated assault on two minor girls in old city hyderabad

Latest Updates