లాక్ డౌన్ వేళ కారు, లారీ ఢీ.. ఐదుగురు మృతి

కరోనాతో దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. ఏ వాహనం కూడా రొడ్డెక్కొద్దని ఆదేశాలున్నాయి. అయినా పట్టించుకోకుండా రోడ్డు మీదకొచ్చిన కారు, లారీ ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందగా.. మరోకరు గాయపడ్డారు. గుజరాత్ లోని సురేంద్రనగర్ జిల్లా లింబ్డిలో ఈ ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామును లింబ్డి-అహ్మదాబాద్ హైవేలో ముందువెళ్తున్న లారీని వెనుకనుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దాంతో ఐదుగురు చనిపోయారు. గాయపడ్డవారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

ఎలుకలపై కరోనా టీకా సక్సెస్.. ఇక మిగిలింది మనుషులపైనే..

ఫ్రీ బియ్యం స్లో పంపిణీ

బండి ఆపినందుకు పోలీసు గల్లా పట్టుకున్న హైదరాబాద్ మహిళ

Latest Updates