పాట్నాలో భారీ పేలుడు

బీహార్ భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం పాట్నాలోని గాంధీ మైదానం సమీపంలోని దల్దలీ రాడ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో పేలుడు జరిగింది. దీంతో ఆ ఇంటితో పాటు పక్కనే ఉన్న మరో ఇల్లు కూడా ధ్వంసమైంది. ఇంట్లో అక్రమంగా దాచిన బాంబు కారణంగానే ఈ పేలుడు జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Latest Updates