పండగపూట విషాదం.. ఇంటి పైకప్పు కూలి ఒకే ఇంట్లో అయిదుగురు మృతి

వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలో పండుగ పూట విషాదఛాయలు అలుముకున్నాయి. బుద్దారం గ్రామంలో పాత మట్టి ఇళ్ళు కూలీ అర్ధరాత్రి ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు మృతిచెందారు. శనివారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన కోమటి చెవ్వ నరసింహ సంవత్సరం క్రితం మరణించాడు. ఆయన సంవత్సరికం సందర్భంగా నలుగురు కుమారులు, నలుగురు కోడళ్లు, మనుమలు, మనుమరాళ్లు ఇంటికి వచ్చారు. అయితే వారంతా శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఇంటి పైకప్పు కూలింది. దాంతో ప్రమాద స్థలంలోనే అయిదుగురు మృతిచెందారు. పండగపూట ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు చనిపోవడంతో గ్రామంలో ఎక్కడా పండగ వాతావరణం కనిపించడం లేదరు. వనపర్తి జిల్లా ఇంచార్జ్, నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ సాయి శేఖర్, వనపర్తి ASP షాకీర్ హుస్సేన్, సీఐ సూర్య నాయక్, ఎస్సై రామన్ గౌడ్, గోపాలపేట మండల తహశీల్దార్ నరేందర్, గిర్దావరి పర్వతాలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

మరణించిన వారి వివరాలు

1) చెవ్వా మనెమ్మ, వయస్సు: 68, భర్త నర్సింహయ్య

2)చెవ్వా సుప్రజ, వయస్సు: 38, భర్త కుమారస్వామి
3)కుమారి వైష్ణవి, వయస్సు: 21, తండ్రి కుమారస్వామి

4) కుమారి రింకి, వయస్సు: 18, తండ్రి కుమారస్వామి

5) చెవ్వా ఉమాదేవి, వయస్సు: 38, భర్త రాఘవేందర్

For More News..

ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు

దుబ్బాక ఎన్నికల ముందు సిద్దిపేట కలెక్టర్ బదిలీ

టీఆర్‌‌ఎస్ కార్యకర్తలకే 10 వేలు ఇస్తున్నరు

Latest Updates