టిఫిన్ చేసినట్లే చేసి తప్పించుకున్న అనుమానిత కరోనా పేషెంట్లు

టిఫిన్ చేసేందుకు వార్డ్ కు వెళ్లిన ఐదుగురు కరోనా వైరస్ పేషెంట్ లు ఆస్పత్రి నుంచి తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇండియా టుడే తెలిపిన వివరాల ప్రకారం మహరాష్ట్ర నాగపూర్ కు చెందిన మాయో హాస్పిటల్ ఐసోలేషన్ వార్డ్ నుంచి అనుమానిత కరోనా వైరస్ రోగులు తప్పించుకున్నారు.వారిలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు మరో మిగిలిన నలుగురి టెస్ట్ ల కోసం ఎదురు చూస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కరోనా సోకిన పేషెంట్ ఆస్పత్రి నుంచి తప్పించుకున్నట్లు ఫిర్యాదు రావడంతో ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టినట్లు  మాయో ఆస్పత్రి పరిధిలో ఉన్న  పోలిస్ స్టేషన్ ఎస్ఐ ఎస్ సూర్యవంశీ చెప్పారు.

టిఫిన్ చేసినట్లే చేసి తప్పించుకున్నారు: ఎస్ఐ ఎస్ సూర్యవంశీ

ఒక కరోనా సోకిన పేషెంట్ , నలుగురు అనుమానిత కరోనా వైరస్ పేషెంట్లు ఆసుపత్రి నుండి తప్పించుకున్నారని సమాచారం అందింది. పేషెంట్ల గురించి, ఆస్పత్రి వార్డ్ లను పరిశీలించేందుకు ఆస్పత్రిని సందర్శించాం. ఈ సందర్భంగా  పేషెంట్లు టిఫిన్ చేసేందుకు వార్డ్ కు వచ్చారని, అనంతరం వార్డ్ నుంచి తప్పించుకున్నట్లు ఎస్ ఐ చెప్పారు.  కరోనా పేషెంట్లను పట్టుకుంటాంసున్నితమైన సమస్య కాబట్టి తప్పని సరిగా పేషెంట్లను పట్టుకుంటామన్నారు. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. మాయో ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు కలిసి బాధితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Latest Updates